News October 6, 2025
ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్

ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టీఓ, గన్ని గోదాం ఇన్‌ఛార్జిలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్‌లతో సోమవారం కలెక్టరెట్‌లో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు జరపాలన్నారు.
Similar News
News January 19, 2026
VJA: వామ్మో.. పండుగ 3 రోజుల్లో ఇంత తాగేశారా!

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ నెల 12 నుంచి 14 వరకు మూడు రోజుల్లో మొత్తం రూ. 38 కోట్ల సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విక్రయాలు రూ. 4 కోట్లు పెరిగాయి. జిల్లాలో జరిగిన కోడిపందేలు, పండుగకు వచ్చిన జనసందోహం ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. జనవరి 15, 16 తేదీల్లో మద్యం డిపోలకు సెలవు కావడంతో విక్రయాలు జరగలేదు.
News January 19, 2026
ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
News January 19, 2026
అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.


