News December 1, 2025
ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News February 13, 2026
రేపు శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవు లేదు: DEO

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం యథావిధిగా పనిచేయనున్నాయని DEO రవిబాబు శుక్రవారం తెలిపారు. వాస్తవానికి రేపు రెండో శనివారం అయినప్పటికీ గత ఏడాది తుఫాన్ సందర్భంగా సెలవుల అనంతరం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాఠశాలలకు పనిదినాలు ఉండనున్నాయని తెలిపారు. పాఠశాలల పనిదినాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రేపు సెలవు రద్దు చేయడం జరిగిందన్నారు.
News February 13, 2026
శ్రీకాకుళం: నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

ఆకాశవాణి.. అంటూ గగనతలం నుంచి సాగిన అదృశ్యవాణి ఒక తరానికి తీరని జ్ఞాపకం. టీవీలు, సెల్ ఫోన్లు రాకముందు రేడియో ఒక అద్భుతమైన స్నేహితుడు. పాటలు, కథలు, న్యూస్, వినోదం ఇలా ఎన్నో రకాల సేవలు అందించే ఈ రేడియో నేటి తరానికి తెలియదు. సమాచార విప్లవం తర్వాత కూడా ఎఫ్.ఎమ్ అంటూ సందడి చేసింది. నేడు ప్రపంచ రేడియో దినోత్సవం.
News February 13, 2026
మందస: రాజవంశీయుడు కన్నుమూత

మందస రాజవంశీయులు కేసరి సింగ్ దేవ్ (79) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లోని ఖార్వేలా నగర్‌లో స్వగృహంలో కన్నుమూశారు. కేసరి సింగ్ దేవ్ గతంలో టెరిటోరియల్ ఆర్మీలో అధికారిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఈయన మృతితో మందసలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ సంస్థానానికి చివరి రాజు అయిన రాజమణి రాజ్ దేవ్ ద్వితీయ కుమారుడే కేసరి సింగ్ దేవ్.


