News January 24, 2025
నందవరంలో చౌడేశ్వరి ఆలయంలో పూజలు

బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన చౌడేశ్వరి మాత ఆలయంలో పుష్య మాసం శుక్రవారం పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరి, అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Similar News
News February 13, 2025
తాడేపల్లి: రేపు కడప వెళ్లనున్న మాజీ సీఎం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.
News February 13, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ డీన్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పరీక్ష ఫలితాలను విద్యార్థులు జ్ఞానభూమి వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు. రీవాల్యుయేషన్‌కు రేపటి నుంచి విద్యార్థులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
News February 13, 2025
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.