News December 1, 2025

నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

image

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.

Similar News

News February 13, 2026

MBNR: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్

image

మహబూబ్‌నగర్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి కుమార్ జిల్లా మేనేజర్ ఉదయ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులకు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

News February 13, 2026

మక్తల్: 22 ఏళ్లకే కౌన్సిలర్‌గా శైవి రెడ్డి

image

మక్తల్ 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బి.శైవి రెడ్డి (22) సంచలన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 321 ఓట్ల మెజార్టీతో గెలిచి, మున్సిపాలిటీలోనే అతి పిన్న వయస్కురాలైన కౌన్సిలర్‌గా గుర్తింపు పొందారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘనంగా అభినందనలు తెలిపాయి.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నీల లోహిత’’

image

సృష్టి ఆరంభంలో బ్రహ్మ దేవుడి కోపం నుంచి శివుడు ఉద్భవించినప్పుడు ఆయన ‘నీల లోహిత’ రూపంలో ఉన్నాడు. ‘నీల’ అంటే ఆకాశం అంతటి నీలి రంగు, ‘లోహిత’ అంటే అగ్ని లాంటి ఎరుపు రంగు. అంటే సృష్టిలోని శాంతిని, అలాగే ప్రళయ కాలంలోని తీవ్రతను రెండింటినీ ఆయన తనలో కలిగి ఉంటారని దీని అర్థం. అర్ధనారీశ్వర రూపానికి ఇది మరో సంకేతం. నీలం రంగు జ్ఞానానికి చిహ్నం అయితే, ఎరుపు రంగు శక్తికి, క్రియాశీలతకు నిదర్శనం.