News August 13, 2025
‘నందికొట్కూరు’ కర్నూలు జిల్లాలో కలవనుందా?

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపాలన్న డిమాండ్ ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆదోని కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసి, నందికొట్కూరును కర్నూలులో కలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై నెల రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Similar News
News March 15, 2026
ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
News March 15, 2026
ADB: కుప్ప కూలిన టెంట్.. తప్పిన ప్రమాదం

జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన హీరా సుకా జయంతి వేడుకల సందర్భంగా భోజనం కోసం ఏర్పాటు చేసిన టెంటు గాలికి కుప్ప కూలింది. ఆ సమయంలో భోజనాలు ప్రారంభం కాకుండా ఆ టెంటు కింద కొంత మంది మాత్రమే ఉండడంతో ప్రమాదం తప్పింది. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే చిన్నపాటి గాలికి టెంటు కుప్ప కూలిందని ఆదివాసీ పర్ధాన్ వాపోయారు.
News March 15, 2026
రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRS

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని అన్నారు.


