News April 10, 2024

నందిగాం: 360 మంది వాలంటీర్లు రాజీనామా

image

నందిగాం మండలంలో 20 సచివాలయాలకు సుమారు 16 సచివాలయాల పరిధిలోని 360 మంది వాలంటీర్లు బుధవారం ఉదయం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలతో మానసిక వేదనకు గురై రాజీనామా చేశామని వారు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటుగా నియోజకవర్గ వైసీపీ నాయకులు ఉన్నారు.

Similar News

News December 11, 2025

శ్రీకాకుళం: మానవ హక్కులపై అవగాహన తప్పనిసరి

image

మానవ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వినియోగదారుల కోర్ట్ సభ్యురాలు జి.రాధారాణి అన్నారు. గురువారం ఉదయం శ్రీకాకుళంలోని ఓ డిగ్రీ కళాశాలలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అధికారాల గురించి సమాచారం తెలియకపోవడంతో వినియోగించుకోవడం లేదని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.

News December 11, 2025

శ్రీకాకుళం: అతని నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీకి చెందిన బగాది కృష్ణారావు (86) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, ఉమా శంకర్ వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

News December 11, 2025

శ్రీకాకుళం: జైల్లో పరిచయం.. బయటకొచ్చి దొంగతనాలు

image

బూర్జలో చోరీలకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ, కోనసీమ, బిహార్‌కు చెందిన నాగరాజు, ఆనంద్, శ్రీను, చంటిబాబు, శుభం మిశ్రా పాత కేసుల్లో జైలుకెళ్లారు. బయటొచ్చాక గాజువాకలో స్థిరపడ్డారు. శ్రీను అత్తగారి ఊరు శ్రీకాకుళం జిల్లా బూర్జ. ఆ గ్రామానికి చెందిన రమేశ్ ఇంటికి తాళం వేసి ఉండటాన్ని శ్రీను గమనించాడు. ఈ నెల 1న అందరూ కలిసి దొంగతనం చేసినట్లు DSP వివేకానంద తెలిపారు.