News October 6, 2024

నంది గరతుమంతుడి వాహనంపై ఊరేగిన రాజన్న

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలలో భాగంగా ఆదివారంరాత్రి స్వామి నంది గరుత్మంతుడి వాహనంపై విహరించారు. నవరాత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్‌లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్‌లో 8.14% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

image

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్‌గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్‌గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.

News December 17, 2025

మూడోదశ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల్లోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, CCటీవీ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.