News October 6, 2025

నంద్యాలలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

నంద్యాల కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నామని కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు మొదట తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయంలోని అధికారులకు అర్జీలు ఇవ్వాలన్నారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలు మాత్రమే జిల్లా కేంద్రంలోని వేదికకు రావాలని సూచించారు.

Similar News

News January 13, 2026

నగరిలో డైయింగ్ ఫ్యాక్టరీల దందా…!

image

నగరిలో 18 డైయింగ్ యూనిట్లు ఉన్నాయి. అనేక కారణాలతో 4యూనిట్లు మూతపడ్డాయి. నూలుకు రంగులు వేసి, ఆ నీటిని మళ్లీ రీసైకిల్ చేసి వాడాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్‌తో రంగులు అద్దిన నీటిని కుశస్థలి నదిలోకి వదిలేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ వాటర్ కలుషితం అవుతోంది. కొన్ని యూనిట్లలో పగలు రీసైకిల్ చేస్తుండగా రాత్రి వేళ నేరుగా వదిలేస్తున్నారు. దీనిపై నగరి ఎమ్మెల్యే ఫోకస్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News January 13, 2026

నెల్లూరు: రూ.200 కోట్ల రుణ ‘సహకారం’

image

సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు ద్వారా 2025-26 మార్చి కల్లా రూ.2,250 కోట్ల రుణాల మంజూరు లక్ష్యం కాగా, రూ.2,050 కోట్ల రుణాలను 37,039 మంది రైతులకు ఇచ్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద వరికి రూ.52 వేలు, మిర్చి రూ.1.50 లక్షలు, పసుపు రూ.1.15-1.25 లక్షలు, నిమ్మ రూ.75- 85 వేలు, అరటి రూ.1.10 లక్షలు, చేపలు, రొయ్యలు రూ.3.75 – 4.07 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. మరో 2 నెలలు గడువుకి రూ.200 కోట్ల రుణాలకు అవకాశం ఉంది.

News January 13, 2026

JGL: ఎమ్మెల్యే గారు ఏ పార్టీ బీ–ఫామ్ ఇవ్వబోతున్నారు?

image

ఎమ్మెల్యే గారు ఏ పార్టీ బీ–ఫామ్ ఇవ్వబోతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి ప్రశ్నించారు. జగిత్యాలలో మంగళవారం ఆమె మాట్లాడుతూ,, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయబోతున్నారని JGl ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిజెపి పార్టీ పని చేస్తుందన్నారు.