News February 17, 2025

నంద్యాల ఎంపీ కార్యాలయం కీలక ప్రకటన

image

ఈనెల 23న ఉదయం 5గం.కు వెంకటాపురం నుంచి నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఎంపీ శబరితో పాటుగా పాదయాత్రకు వెళ్లే నేతలు, కార్యకర్తలు, ప్రజలు దారిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు తమ వివరాలను కార్యాలయానికి తెలియజేయాలని పిలుపునిచ్చింది.

Similar News

News March 16, 2026

NZB: ఫీజులు లక్షల్లో.. భోజనం నరకప్రాయం

image

ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న ఆహారంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు భోజనం విషయంలో నాణ్యత పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. మెనూ ప్రకారం బ్రేక్‌ఫాస్ట్ అందించకుండా, ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం తిండితో అనారోగ్యం పాలవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

News March 16, 2026

HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

image

నగరంలో వీకెండ్‌ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.

News March 16, 2026

కడప: పదో తరగతి ఎగ్జాం రూములోకి పాము

image

కడప జిల్లా బి.కోడూరులో పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. స్థానికంగా ఉన్న ఓ పరీక్షా కేంద్రంలోని రూములోకి పాము వచ్చింది. విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్కూల్ సిబ్బంది పామును చంపి బయట వేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లారు.