News May 7, 2025
నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్

నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అధినేత, వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మద్యం కుంభకోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయనను అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణం కేసులో ఏ-6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించింది. నేడు ఏసీబీ కోర్టులో శ్రీధర్‌ను హాజరుపరచనున్నారు.
Similar News
News February 13, 2026
తిరుపతి SVU విద్యార్థులకు గమనిక

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 63-68 వార్షిక కాన్వకేషన్స్ (Convocations) దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (CE) రాజమాణిక్యం పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలోపు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు మార్చి 10వ తేదీ కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News February 13, 2026
సంచలనం.. ఓటుకు రూ.70,000?

TG: రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు ఎన్నిక సంచలనంగా మారింది. కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఓటుకు ₹70K, 25KGల బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పట్టుచీర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ₹7Cr ఖర్చు చేశారని టాక్. అదే వార్డులో మరో అభ్యర్థి కూడా ఓటుకు ₹40K పంచినట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ ఊపులో ఉండటంతోనే పదవికి పోటీ ఏర్పడిందంటున్నారు.
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.


