News March 14, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ పాణ్యంలో ఎండ ధాటికి స్కూటీ దగ్ధం
☞ ఎస్సీ వర్గీకరణ అధ్యయనానికి సభ్యుడిగా మంత్రి బీసీ
☞ YCP నేతపై హత్యాయత్నం.. 9 మంది TDP నేతలపై కేసు
☞ హత్యాయత్నం కేసులో ఇద్దరికీ 7 ఏళ్ల జైలు శిక్ష
☞ సంతేకుడ్లూరులో వింత ఆచారం.. స్త్రీ వేషధారణలో పురుషులు
☞ బ్రాహ్మణకొట్కూరు విద్యార్థినికి బంగారు పతకం
☞ కోవెలకుంట్ల జాబ్ మేళాలో 38 మందికి ఉద్యోగాలు
☞ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు

Similar News

News February 7, 2026

HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

image

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

News February 7, 2026

జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో 2026-28 సంవత్సరాలకు గాను జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఈనెల 28తో ముగియనుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం నూతన కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

News February 7, 2026

ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

image

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.