News March 17, 2025
నంద్యాల జిల్లాలో 394 మంది గైర్హాజరు

నంద్యాల జిల్లా పరిధిలో సోమవారం తొలిరోజు పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 394 మంది పరీక్షలకు గైర్హాజరైనట్లు DEO జనార్దన్ రెడ్డి తెలిపారు. మొత్తం 24,907 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 24,513 మంది పరీక్షలు రాశారని డీఈవో చెప్పారు.
Similar News
News April 20, 2025
DSC: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 26, ➱HINDI: 28, ➱ENG: 55, ➱MATHS: 59, ➱PS: 39, ➱BS: 58, ➱SOCIAL: 91, ➱PE:139, ➱SGT: 239, ➱TOTAL: 734 ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱TEL: 07, ➱HINDI: 11, ➱MATHS:07, ➱PS: 35, ➱SOCIAL:05, ➱SGT: 335, ➱TOTAL:400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News April 20, 2025
ఇటిక్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.