News November 20, 2025
నంద్యాల జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: ఎంపీ శబరి

నంద్యాల జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నంద్యాల ఎంపీ, జిల్లా అభివృద్ధి సమన్వయ & పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, సీఈఓ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 14, 2026
అరసవల్లిలో ‘సామాన్య’ దర్శనానికే పెద్దపీట

అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకే అగ్రతాంబూలం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్సవాల నిర్వహణపై జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టార్లో కీలక శాఖల అధికారులు అందుబాటులో ఉండి పర్యవేక్షించాలనిన్నారు
News January 14, 2026
BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.
News January 13, 2026
పవన్ కళ్యాణ్‌కు మోదీ అభినందన

AP: జపనీస్ <<18828407>>కత్తిసాము<<>> కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను PM మోదీ ప్రశంసించారు. ‘ఇటు ప్రజా జీవితంలో, అటు సినిమా కెరీర్‌లో బిజీగా ఉంటూనే మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయం. యుద్ధ కళలు అభ్యసించడానికి శారీరక బలంతోపాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరం. ఫిట్ ఇండియాకు ప్రజాజీవితంలో ఉన్న మీలాంటి వ్యక్తులు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.


