News February 8, 2025

నంద్యాల జిల్లా ఎస్పీ కీలక సూచన

image

వాలంటైన్స్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు కీలక సూచన చేశారు. ఆఫర్స్ పేరుతో వచ్చే బహుమతులపై జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్లు వాలెంటైన్స్ డే కోసం బహుతులు అంటూ నకిలీ లింకులు పంపిస్తారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తెలియని లింకులు క్లిక్ చేయొద్దని అన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News February 13, 2026

గుడ్ న్యూస్.. బెంగళూరులో ఆర్సీబీ మ్యాచులు

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. జస్టిస్ మైఖేల్ డి కున్హా సిఫార్సులను అమలు చేయనున్నట్లు Xలో వెల్లడించారు. టికెట్లు, ప్రేక్షకుల నియంత్రణ, స్టేడియం యాక్సెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. బాధ్యత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తామని చెప్పారు.

News February 13, 2026

NRPT: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత!

image

NRPT జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 550 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News February 13, 2026

అనకాపల్లి: శివరాత్రికి శైవ క్షేత్రాలకు నడిచే బస్సులు ఎన్ని అంటే?

image

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి శైవ క్షేత్రాలకు 95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అధికారిణి ప్రవీణ తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రావికమతం మండలం కళ్యాణపులోవ, గొలుగొండ మండలం దారమఠం, విజయనగరం జిల్లా పుణ్యగిరి శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.