News April 14, 2025
నంద్యాల జిల్లా TODAY TOP NEWS.!

☞కొలిమిగుండ్ల, చాగలమర్రిలో 39⁰C ఉష్ణోగ్రత
☞వైసీపీ పొలిటికల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా బుగ్గన
☞ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నందికొట్కూరు కుర్రాడు
☞అవుకులో 14న ఉచిత కంటి వైద్య శిబిరం
☞శ్రీశైలంలో భక్తుల రద్దీ
☞క్యాన్సర్‌ను జయిస్తూ 420/440 మార్కులతో గోనెగండ్ల విద్యార్థిని ప్రతిభ
☞ బనగానపల్లె GJC, నందివర్గం ZPHS విద్యార్థుల అపూర్వ కలయిక
☞రేపు ఎస్పీ కార్యాలయంలో PGRS రద్దు
Similar News
News April 18, 2025
వసతి గృహంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
News April 18, 2025
‘అద్భుత శిల్ప సంపద మన మెదక్’

మెదక్ జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నట్లు యువ చరిత్ర పరిశోధకుడు సంతోష్ తెలిపారు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం సందర్బంగా మాట్లాడుతూ.. వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం, వెల్దుర్తి కాకతీయ కళాతోరణం, కొంటూరు మసీద్, సీఎస్ఐ చర్చి లాంటి ఎన్నో అద్భుతమైన పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న అత్యద్భుతమైన శిల్ప సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు.
News April 18, 2025
IPL: అభిషేక్ జేబులు చెక్ చేసిన సూర్య కుమార్

MI, SRH మధ్య నిన్న ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. SRH ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశారు. ఇటీవల పంజాబ్‌పై సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ జేబులోంచి నోట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితమంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లోనూ అలానే నోట్ రాసుకొచ్చారేమో అని SKY చెక్ చేయడం గ్రౌండ్‌లో నవ్వులు పూయించింది.