News October 6, 2025

నంద్యాల: ‘దరఖాస్తులు నిర్ణీతకాలంలో పరిష్కరించాలి’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నిర్ణీత కాలపరిమితిలోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో డీఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. అర్జీదారులు సమర్పించిన ప్రతి అర్జీని జాగ్రత్తగా చదివి పరిష్కరించాలన్నారు.

Similar News

News January 13, 2026

2027 ఎన్నికల్లో UP సీఎం అభ్యర్థిగా ప్రియాంక?

image

INC ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ UP రాజకీయాల్లో మళ్లీ కేంద్రబిందువుగా మారారు. నిన్న ఆమె 54వ పుట్టిన రోజు వేడుకలను పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. BCలను ఆకర్షించేలా పరివర్తన్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని UPCC చేపట్టింది. దీంతో 2027 UP అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ CM అభ్యర్థిగా ప్రియాంక ఉంటారన్న ప్రచారం ఊపందుకుంది. ఆమె నేతృత్వంలో అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.

News January 13, 2026

పరమానందంగా రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ, యౌక్త్రధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.

News January 13, 2026

ఇండియాలో ఆడబోం.. ICCకి స్పష్టం చేసిన బంగ్లా

image

టీ20 వరల్డ్‌కప్ మ్యాచులను ఇండియాలో <<18761652>>ఆడబోమని<<>> బంగ్లాదేశ్ మరోసారి స్పష్టం చేసింది. తమ ప్లేయర్ల భద్రత దృష్ట్యా వేరే దేశంలో మ్యాచులు నిర్వహించాలని కోరింది. ఇవాళ ICCతో బంగ్లా బోర్డు వర్చువల్‌గా సమావేశమైంది. టోర్నమెంట్ షెడ్యూలు, ప్రయాణ ప్లాన్ ఇప్పటికే ఖరారైందని, దీనిపై పునరాలోచించాలని ICC కోరింది. కానీ BCB ఒప్పుకోలేదు. దీంతో ఏకాభిప్రాయం కోసం చర్చలను కొనసాగించాలని బోర్డులు అంగీకరించాయి.