News March 13, 2025
నంద్యాల: బొలెరోతో ఢీకొట్టి.. చోరీ

బేతంచర్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జస్వంత్ నంద్యాలలో బైక్‌ను కొనుగోలు చేసి బేతంచర్లకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ్మరాజు పల్లె ఘాట్ వద్ద దుండగులు జస్వంత్ బైకును బొలెరోతో ఢీ కొట్టారు. జస్వంత్ కిందపడిపోగా అతని చేతికి ఉన్న 4 తులాల బ్రేస్‌లెట్, 2 ఉంగరాలను బొలెరోలో వచ్చిన ముగ్గురు దొంగలు దోచుకున్నారు. ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 15, 2025
వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.
News March 15, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 365 మంది గైర్హాజరు: ఆర్ఐఓ

శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శనివారం 365 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ పి దుర్గారావు శనివారం తెలిపారు. 17,452 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 17,087 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఆయన వివరించారు.
News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.