News December 3, 2025

నంద్యాల: ‘మెగా PTM విజయవంతం చేయాలి’

image

నంద్యాల జిల్లాలో డిసెంబర్ 5న జరిగే మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ తమ ఛాంబర్ నుంచి మెగా PTMపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ.. ఈనెల 5న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా PTM కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Similar News

News February 12, 2026

కాకినాడ పోలీస్ శాఖకు ‘సీ పోర్ట్స్’ గిఫ్ట్.. రూ.12 లక్షల వాహనం బహూకరణ

image

కాకినాడ ‘సీ పోర్ట్స్’ లిమిటెడ్ (SPL) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా పోలీస్ శాఖకు రూ.12 లక్షల విలువైన మహీంద్రా బొలెరో వాహనాన్ని బహూకరించింది. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ వాహన తాళాలను అందుకుని, జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ యంత్రాంగానికి అండగా నిలిచిన సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

News February 12, 2026

తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

image

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.

News February 12, 2026

పెద్దపల్లి : ఓటింగ్‌లో మగువలే మేటి!

image

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,28,023 మంది మహిళా ఓటర్లకు గానూ 91,873 మంది పోలింగ్‌లో పాల్గొనడంతో 71.76 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండంలో 62,868, పెద్దపల్లిలో 16,319, సుల్తానాబాద్‌లో 7,023, మంథనిలో 5,663 మంది మహిళలు ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళా లోకం చైతన్యం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం విశేషం.