News April 14, 2025
నంద్యాల: ‘మెరుగైన వైద్యం అందాలి’

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి ఫరూక్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ రకాల వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి నిత్యం వందల మంది వస్తుంటారని, వైద్యసేవల కోసం వచ్చేవారి పట్ల వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు.
Similar News
News January 15, 2026
MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
#SHARE IT
News January 15, 2026
విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
News January 15, 2026
మురిపించిన వేళ్ల విన్యాసం.. పరవశించిన ముంగిళ్లు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు సంబరంగా జరిగాయి. జిల్లాలోని ప్రతి ఇల్లూ కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో కళకళలాడింది. ముగ్గుల పోటీలు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతులు, చిన్నారులు తమ వేళ్ల విన్యాసంతో ముంగిళ్లను మురిపించారు. ప్రతి ఇంట్లో పిండివంటల ఘుమఘుమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గారెలమ్మలు, అరిసెలు, సకినాల వాసనలతో వాడలన్నీ నిండిపోయాయి.


