News June 18, 2024
నకరికల్లు: ఇద్దరు బాలికలపై వృద్ధుడి లైంగిక దాడి

8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నకరికల్లు మండలంలో సోమవారం వెలుగుచూసింది. నకరికల్లుకు చెందిన నాగమల్లేశ్వరరావు(62) ఇద్దరు బాలికలకు మాయ మాటలు చెప్పి, 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓ బాలిక కడుపు నొప్పితో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు నకరికల్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 18, 2026
రెవెన్యూ క్లినిక్‌లు ప్రజలు వినియోగించుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం, కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ భూ రికార్డులతో హాజరవుతారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News January 18, 2026
సరస్ మేళాకు రూ.25కోట్ల ఆదాయం: కలెక్టర్

గుంటూరు నగరంలో 13 రోజుల పాటు జరిగిన సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజార్ రికార్డు సృష్టించింది. మొత్తం 343 స్టాల్స్ ఈ మేళాలో ఏర్పాటవ్వగా 25 లక్షల మంది ప్రజలు మేళాను సందర్శించారు. ఈ మేళా ద్వారా మొత్తం రూ.25కోట్ల ఆదాయం వచ్చింది. ఆదివారం జరిగిన సరస్ ముగింపు సభలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ విషయాన్ని వెల్లడించారు. సరస్ మేళా టెస్ట్ మ్యాచ్ తరహాలో అద్భుతంగా జరగడం శుభపరిణామం కలెక్టర్ కొనియాడారు.
News January 17, 2026
ANU: ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం

ఇన్‌ఫ్లిబ్‌నెట్ సేవలపై వినియోగదారుల అవగాహన కార్యక్రమం ఈ నెల 22వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని OSD ఆచార్య రవికుమార్ తెలిపారు. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్‌వర్క్ (ఇన్‌ఫ్లిబ్‌నెట్) సెంటర్, గాంధీనగర్, గుజరాత్, ఉన్నత విద్యా కమిషనరేట్ AP, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాల్గొనదలచిన వారు ఈ నెల 20వ తేదీలోగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


