News April 22, 2025

నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్‌లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్‌లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News March 11, 2026

ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే?

image

ప్రెగ్నెన్సీలో ఉమ్మనీరు బిడ్డకు కవచంలా ఉంటూ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా రక్షిస్తుంది. ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం ఎక్కువవుతుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది అవుతుంది. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి బేబీ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఉమ్మనీరు ఎంత ఉందో చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 11, 2026

హైదరాబాద్‌లో హై టెన్షన్ తీర్పు

image

BRS నుంచి గెలిచి పార్టీ మారారనే ఆరోపణలు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి వాదనలు విన్న స్పీకర్ తీర్పు హై టెన్షన్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఈనెల 12లోపు నిర్ణయం ప్రకటించాలి. ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ MLA దానాన్ని అనర్హుడిగా ప్రకటిస్తారా? క్లీన్ చిట్ ఇస్తారా? లేదా మరోసారి పొడిగిస్తారా? కాసేపట్లో తేలనుంది.