News October 6, 2025
నకిలీ మద్యంపై అనుమానం ఎలా వచ్చిందంటే…?

నకిలీ మద్యం పట్టివేత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్నాళ్ల క్రితం ఎక్సైజ్ అధికారులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో<<17904625>> నకిలీ మద్యం<<>> బాటిల్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగా… స్కాన్ కాలేదు. అనుమానం వచ్చిన ఎక్సైజ్ అధికారులు సప్లై చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచారు. పాలవ్యాన్లో సప్లై చేస్తున్నట్లు గుర్తించి సురేంద్ర నాయుడు, జయచంద్ర రెడ్డి PA రాజేష్ పై కేసు నమోదు చేశారు.
Similar News
News January 23, 2026
లిక్కర్ స్కామ్.. ముగిసిన మిథున్‌రెడ్డి విచారణ

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7 గంటలపాటు హైదరాబాద్ ఈడీ ఆఫీసులో అధికారులు ఆయనను విచారించారు. మిథున్‌రెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డు చేశారు. అనంతరం ఆయన ఇంటికి వెళ్లిపోయారు. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో అధికారులు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
News January 23, 2026
తడి, పొడి చెత్త సేకరణ పక్కాగా జరగాలి: కలెక్టర్

ఎన్‌జీటీ ఆదేశాలతో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శుక్రవారం ఏలూరులో అధికారులతో సమీక్షించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించి, భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
News January 23, 2026
మంచిర్యాల: ‘నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలి’

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు అందిస్తోన్న శిక్షణను సద్వినియోగం చేసుకొని శిక్షణలో నేర్చుకున్న అంశాలను కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. పారదర్శకంగా, నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు.


