News October 6, 2025
నకిలీ మద్యం తయారీలో వేళ్లని ఆయన వైపే?

ములకలచెరువు నకిలీ మద్యం తయారీలో మూల సూత్రధారి జయచంద్రారెడ్డి అంటూ సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. పీఏ రాజేశ్, ప్రధాన అనుచరుడు కట్టా సురేంద్ర నాయుడును ముందు పెట్టి వ్యవహారాలన్నీ ఆయననే నడిపించాడని టాక్ నడుస్తోంది. ఈ ఆరోపణలను టీడీపీలోని మరో వర్గం బలంగా చెప్తోంది. జయచంద్రారెడ్డి పాత్రపై ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Similar News
News January 22, 2026
పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్‌లు సాధించిన సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్‌లా మార్చే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్‌ను పవర్‌ఫుల్ రోల్‌లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్‌ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్‌లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.
News January 22, 2026
ICOC చిత్తూరు ఛైర్మన్‌గా మనోజ్

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్‌గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.
News January 22, 2026
దారులన్నీ మేడారం వైపే!

వనదేవతల మహాజాతర సమయం ఆసన్నం కావడంతో దారులన్నీ మేడారం వైపే మళ్లుతున్నాయి. బుధవారం నుంచి శ్రీ సమ్మక్క-సారలమ్మల జాతర ఉత్సవాలు ‘మండ మెలగు’ వేడుకతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్ల జాతర వైభవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు ఉత్సాహంగా పయనమవుతుండటంతో అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది.


