News January 16, 2025
నక్కపల్లి: బాలుడిని కాపాడబోయి మృత్యువాత పడిన యువకుడు

ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో <<15167020>>బాలుడిని<<>> కాపాడబోయిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈనెల 15వ తేదీన సముద్రతీరంలో బాలుడు మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన మణికంఠ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన యువకుడు గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల సముద్రతీరానికి కొట్టుకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 13, 2026
ఏప్రిల్ 17న సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు: ఈవో

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న గంధం అమావాస్యను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. 16న సాయంత్రం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి రాత్రి కొండదిగువన వరాహ పుష్కరిణి వద్ద, కొండపైన జాగరం చేసి అమావాస్య రోజు దర్శించుకోవడం ఆనవాయితిగా వస్తోంది. కావున ఏప్రిల్ 17న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు ఈవో వెంకట్రావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News April 12, 2026
విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 12, 2026
విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.


