News August 12, 2025

నగరంలోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

image

HYDలోని సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ జంక్షన్, పర్వత్‌నగర్ 100 ఫీట్ల రహదారి, అంజయ్యనగర్ నుంచి కొత్తగూడ రోడ్డు, గచ్చిబౌలి వంతెన, NCB జంక్షన్, బొటానికల్ గార్డెన్, హైటెక్స్ కమాన్, KPHB ఏరియాలో భారీగా వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్లియర్ చేసేందుకు కృషి చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

దూసుకెళ్తున్న బాలెన్ షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల <<19309327>>ఫలితాల్లో<<>> రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) దూసుకెళ్తోంది. 68 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ప్రత్యర్థులు దీనికి దరిదాపుల్లో కూడా లేరు. మాజీ PM కేపీ ఓలీ పార్టీ 5 సీట్లతో మూడో స్థానానికి పడిపోయింది. గగన్ కుమార్ థాపా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ 9 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీన్ని బట్టి బాలెన్ షాకు చెందిన RSP ఫుల్ మెజార్టీతో అధికారం చేపట్టనున్నట్లు స్పష్టమవుతోంది.

News March 6, 2026

10 రోజులు కరెంట్ కోతలు.. ఎందుకంటే?

image

TG: రాష్ట్రంలో రాబోయే 10 రోజులు గృహ అవసరాలకు షెడ్యూల్ చేయని కరెంట్ కోతలు ఉంటాయని తెలుస్తోంది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో హైదరాబాద్‌తో సహా అనేక చోట్ల పవర్ సప్లై పరికరాలు ఓవర్‌లోడ్‌ను ఎదుర్కొంటున్నాయి. దీంతో అధికారులు నిర్వహణ పనులు చేపట్టారు. ఈ పనుల పూర్తికి కనీసం వారం పట్టనుంది. గ్రామాల్లోనూ పాత ట్రాన్స్‌ఫార్మర్‌లను మారుస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు తెలిపారు.

News March 6, 2026

పునరావాస కేంద్రాల్లో ‘భూదాన్’ బాధితుల అరిగోస

image

ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులు అవస్థలు పడుతున్నారు. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేదని, స్వచ్ఛంద సంస్థలు అందించే భోజనమే దిక్కని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.