News November 19, 2025

నగరంలో 3 స్థానాలకు ఉపఎన్నికలు?

image

పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ తీవ్రజాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే HYDలో తర్వలో 3స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ MLA దానంనాగేందర్, శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్, RRలోని చేవెళ్ల MLA కాలె యాదయ్య పార్టీ ఫిరాయించారని, అక్కడ బైపోల్ అనివార్యమని BRS చెబుతూనే ఉంది.

Similar News

News January 24, 2026

WGL: ‘రూ.కోటి ఇస్తా ఛైర్మన్ చేయండి..!’

image

WGL జిల్లాలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆశావహుల హడావిడి మామూలుగా ఉండటం లేదు. తాజాగా వర్ధన్నపేట ఛైర్మన్ పదవి ఇస్తే రూ.కోటి ఇస్తానంటూ ఏకంగా డబ్బుల సంచితో సమావేశానికి రావటంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎదుట డబ్బులు చూపించి పదవి కావాలని అడిగాడట. గతంలో ఒక్క ఓటుతో తన భార్యను గెలిపించుకున్న వ్యక్తి ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక్కడ ఛైర్మన్ (R)జనరల్.

News January 24, 2026

సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

image

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 72 వార్డుల కోసం 176 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులకు 49 మంది ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 13 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణలో త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు.

News January 24, 2026

ఖమ్మం: ‘రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

image

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, ముస్లిం ప్రతినిధులతో సమీక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైనేజీ, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.