News October 6, 2025

నగరం మురవంగ.. బోర్లు ఉప్పొం‘గంగ’

image

ప్రస్తుత సీజన్‌లో HYD, ఉమ్మడి RRజిల్లాలో నమోదవ్వాల్సిన వర్షపాతం కంటే 45% ఎక్కువ వర్షపాతం రికార్డ్ కావడంతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. HYDలో 0.75 అడుగులు, రంగారెడ్డి జిల్లాలో 1.94 అడుగులు, మేడ్చల్ జిల్లాలో 2.64 అడుగులు పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే సగటున 2- 3 అడుగులు పెరిగినట్లు భూగర్భ జలాల శాఖ అధికారి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది వేసవిలో 20మీటర్ల లోతుకు ఇంకిన విషయం తెలిసిందే.

Similar News

News January 24, 2026

ఫిరంగిపురంలో చెత్త సంచిలో చిన్నారి

image

ఫిరంగిపురంలో కనిపించిన ఈ దృశ్యం నిజంగానే గుండెను బరువెక్కించేలా ఉన్నాయి. ‘లోకమంతా బడి బాట పడుతుంటే.. ఈ చిన్నారి మాత్రం చెత్త సంచిలో’ ఒదిగిపోయాడు. రిక్షా వెనుక వేలాడుతున్న ఆ సంచే ఆ పసివాడికి ఊయల అయ్యింది. రేపటి పౌరుడిగా ఎదిగాల్సిన వయసులో, చెత్త కుప్పల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్న ఆ చిన్నారి చూపులు సమాజాన్ని నిలదీస్తున్నట్లుగా ఉన్నాయి.

News January 24, 2026

విశాఖ: చదువుకున్న వారే మోసపోతున్నారు..

image

చదువుకున్న వారే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులే ఉన్నారు. తాజాగా నగరంలోని ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి సైబర్ ముఠా రూ.10 లక్షల వరకు కాజేశారు. ఈ కేసులో విశాఖ సైబర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రాంతానికి చెందిన రమేశ్, పరుశురాములు, నిశాంత్‌ కలిసి ఓ వ్యక్తి అకౌంట్ తీసుకుని సైబర్ క్రైమ్ ముఠాకు కమిషన్ రూపంలో అప్పజెప్పినట్లు దర్యాప్తులో తేలింది.

News January 24, 2026

రానున్న 24 గంటల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, 2-3డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పింది. మరోవైపు నిన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. అల్లూరి (D) జి.మాడుగులలో 6.3డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.