News August 22, 2025

నగర వాసి దాహం తీర్చేందుకు జలమండలి కసరత్తు

image

మహానగరంలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇపుడు మరో 6 రిజర్వాయర్లు నిర్మించనుంది. ఆస్మాన్‌ఘడ్‌లో 2 నిర్మించనుండగా మహేంద్రహిల్స్‌లో ఒకటి, నియో పోలీస్‌లో 3 నిర్మించనుంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో 15 రిజర్వాయర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 297 రిజర్వాయర్లు నగరవాసి దాహాన్ని తీర్చుతున్నాయి.

Similar News

News January 17, 2026

HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

image

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.

News January 17, 2026

రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

image

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.

News January 17, 2026

JBS-శామీర్‌పేట మెట్రో: ఎయిర్ బేస్ దగ్గర పిల్లర్ల పరేషాన్

image

JBS-శామీర్‌పేట మెట్రో లైన్ నిర్మాణంలో హకీంపేట ఎయిర్ బేస్ రన్‌వే ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇక్కడ పిల్లర్లు వేస్తే యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఎత్తు అడ్డు తగులుతుందని 2025 మధ్యలో ఆర్మీ అభ్యంతరం పెట్టింది. రన్‌వేకి అంత దగ్గరలో మెట్రో పిల్లర్లు ఉంటే పైలట్లకు సేఫ్టీ ప్రాబ్లమ్ వస్తుందని క్లియరెన్స్ ఆపేశారు. దీంతో ఈ 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను భూమి లోపలికి దించేయాలని ప్లాన్ మార్చారు.