News December 2, 2025

నడకతో అల్జీమర్స్‌ను నివారించొచ్చు: వైద్యులు

image

అల్జీమర్స్‌ను నడకతో నివారించవచ్చని కొత్త అధ్యయనంలో తేలిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నేచర్ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజుకు 3,000–5,000 అడుగులు నడిస్తే మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ల నిర్మాణం నెమ్మదిస్తుందని తేలింది. అల్జీమర్స్‌కు చికిత్స లేనప్పటికీ, నివారణ సాధ్యమని చెబుతున్నారు. నడక అనేది అత్యంత శక్తిమంతమైన నివారణ మార్గమని, నడక మొదలుపెట్టాలని సూచించారు.

Similar News

News February 10, 2026

మా ఇంధనం ఇండియా కొనకుండా US అడ్డుకుంటోంది: రష్యా

image

ఇండియా, ఇతర భాగస్వాములు తమ చౌకైన ఇంధనం కొనకుండా నిషేధించాలని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపించింది. అధిక ధరలకు US LNGని కొనాలని బలవంతం చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌తో సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతిపాదనను తాము అంగీకరించామని, కానీ కొత్త ఆంక్షలు విధించారని విమర్శించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సరఫరా మార్గాలను నియంత్రించడమే ఆ దేశ లక్ష్యమని ఫైరయ్యారు.

News February 10, 2026

ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

యూపీలోని HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 5 ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 17, 19 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి డీఫార్మసీ/బీఫార్మసీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.lifecarehll.com

News February 10, 2026

ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ ఒక్క పాయింట్ చెక్ చేయండి..

image

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రీమియంతో పాటు ‘క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో’ (CSR) చూడటం చాలా ముఖ్యం. ఒక ఏడాదిలో కంపెనీకి వచ్చిన మొత్తం క్లెయిమ్‌లలో ఎన్నింటిని పరిష్కరించారో తెలిపే శాతమే ఈ CSR. IRDAI ఏటా ఈ వివరాలను వెల్లడిస్తుంది. సాధారణంగా 95% కంటే ఎక్కువ రేషియో ఉన్న కంపెనీలు నమ్మదగ్గవి. ఆపదలో ఆర్థిక సాయం సకాలంలో అందాలంటే అధిక CSR ఉన్న సంస్థను ఎంచుకోవడం బెటర్.