News March 7, 2025
నడిగూడెం: గుండెపోటుతో మహిళ మృతి

గుండెపోటుతో మహిళా మృతి చెందిన ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నడిగూడెం గ్రామానికి చెందిన పాతకోట్ల అంజమ్మ HYDలోని షాద్ నగర్ వద్ద తన కుమారుడు ఇంటి వద్ద నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకువెళ్లే లోపే గుండెపోటుతో మృతిచెందింది.
Similar News
News December 7, 2025
పంజాబ్‌లో కోచ్ ఫ్యాక్టరీలా ప్రత్యేక జీవో తేవాలి!

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం 80 % పూర్తయినా, స్థానికులకు ఉద్యోగాలపై రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పష్టత ఇవ్వకపోవడంతో భూ బాధితులు, నిరుద్యోగుల్లో ఆత్రుత పెరిగింది. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు ‘చూద్దాం’అంటూ దాటవేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్‌లో కోచ్ ఫ్యాక్టరీలా ప్రత్యేక జీవో తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 7, 2025
నంద్యాల: పెళ్లి అయిన నెలకే యువకుడి సూసైడ్

అనంత(D) యాడికి మండలం నగరూరుకు చెందిన శరత్‌కుమార్(25) కొలిమిగుండ్ల జగనన్న కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మిత్రుడు హరీశ్ ఇంటికి వచ్చిన శరత్.. శనివారం హరీశ్ డ్యూటీకి వెళ్లిన తర్వాత విషగుళికలు మింగాడు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని అనంతపురం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. శరత్ గత నెలలో బళ్లారిలో వివాహం చేసుకుని, బెంగళూరులో ప్రైవేట్ జాబ్‌లో చేరాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
MBNR: అప్పటివరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది : కలెక్టర్

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ గురించి స్పష్టతనిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఆమె తెలిపారు. ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన వారిపై ఎన్నికలకు దూరమయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏకగ్రీవమైన పంచాయతీలలో సైతం కోడ్ తప్పనిసరిగా అమలవుతుందని, ఎవరూ నియమాలను అతిక్రమించకూడదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.


