News September 12, 2025
నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.
Similar News
News December 12, 2025
నెల్లూరు: నేటి అర్ధరాత్రి నుంచి అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ క్లోజ్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో తూర్పు పడమర ప్రాంతాలను అనుసంధానం చేసే ప్రధానమైన అయ్యప్ప గుడి ఫ్లైఓవర్ మరమ్మతు పనుల దృష్ట్యా నేటి అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు కమిషనర్ వై.ఓ నందన్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి వచ్చే ఏడాది జనవరి నెల 10వ తేదీ వరకు మరమ్మతు పనులను చేపట్టి ఫ్లైఓవర్‌ను ఆధునికరించనున్నామని కమిషనర్ వివరించారు.
News December 12, 2025
NLR: ఒకే చీరకు ఉరేసుకుని భార్యాభర్తల సూసైడ్

నెల్లూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. టీపీగూడూరు మండలం వరకవిపూడికి చెందిన ఈదూరు నరేశ్(34), ప్రమీలమ్మ(28) దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ ఇంట్లోనే ఒకే చీరకు ఉరేసుకున్నారు. కుటుంబంలో ఏం జరిగింది? ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 12, 2025
నెల్లూరులో పొలిటికల్ హీట్ !

వణికించే చలిలోనూ నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. కార్పొరేషన్ మేయర్ అవిశ్వాస ముహూర్తం దగ్గర పడే కొద్దీ పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి 57 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం రోజు కనీసం 38 మంది హాజరుకావాలి. 20 మంది గైర్హాజరు అయితే సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఆ నంబర్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.


