News November 6, 2025

నన్ను కొట్టడానికి రూ.10 లక్షల డీల్: రేగా

image

బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కొట్టడానికి కొందరు రూ.10 లక్షల డీల్ మాట్లాడినట్లు SMలో ఆరోపించారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్లో ఈరోజు సాయంత్రం ఎదురుచూస్తానని, తనను కొట్టేవారికి రూ.10 లక్షలు వస్తాయంటే నేను దెబ్బలు తినడానికి రెడీ అని ప్రకటించారు. తన వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందని తెలిపారు.

Similar News

News January 16, 2026

NLG: రైతులకు అలర్ట్.. ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే పథకాలు కట్

image

వ్యవసాయ ఆధునికీకరణలో భాగంగా ప్రభుత్వం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును తప్పనిసరి చేసింది. ఈ ఐడీ ఉంటేనే పీఎం కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి నల్గొండలో ఇంకా చాలా మంది రైతులు నమోదు చేసుకోకపోవడంతో ఏఈవోలు లేదా మీ-సేవా కేంద్రాలను రైతులు సంప్రదించాలని వారు సూచించారు. భవిష్యత్తులో పథకాలు పొందాలంటే ఈ నమోదు కీలకమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

News January 16, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

News January 16, 2026

HYD: రోడ్డుపై బండి ఆగిందా? కాల్ చేయండి

image

HYD- విజయవాడ హైవే పై వెళ్తుంటే మీ బండి ఆగిపోయిందా? వెంటనే 1033కి కాల్ చేయండి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తారు. పెట్రోల్, డీజిల్ అయిపోతే అందజేస్తారు. దానికి తగిన ధర చెల్లించాలి. టైర్‌పంచర్ అయితే ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ సేవలు 24Hrs అందుబాటులో ఉంటాయి. కుటుంబంతో హ్యాపీగా వెళ్తుంటే కార్ ఆగిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అందుకే ఈ నం. సేవ్ చేసుకోండి.. అవసరమవుతుంది.
# SHARE IT