News March 27, 2024

నరసన్నపేట: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఉపాధ్యాయుడిపై చర్యలు

image

మండలంలోని మూగిపురం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీ నారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని నరసన్నపేట ఆర్వో జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు సారవకోట ఎంపీడీవో ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు ఉంటాయని అన్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి కూడా నివేదించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 17, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤ఎల్.ఎన్ పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోట్లు వచ్చిన ఆనందం
➤మందస: పొక్సో కేసులో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
➤ప్రజాదర్బార్ నిర్వహించిన కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యే బగ్గు
➤టెక్కలికి ఆయుష్ ఆసుపత్రి మంజూరు: అచ్చెన్న
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 39, కలెక్టర్ గ్రీవెన్స్‌కు 94 వినతులు
➤పలాసలో అక్రమ గ్రావెల్ తరలింపు

News February 16, 2026

ఎల్.ఎన్.పేట: ఆ క్షణం వచ్చిన కాసులే..కోటి వచ్చిన ఆనందం

image

ఎల్.ఎన్.పేట(M) కేంద్రంలో పెద్దకోట గ్రామానికి చెందిన కొంత మంది రైతులు మొక్కజొన్న పొత్తులను ప్రయాణికులకు అమ్ముతున్న దృశ్యం సోమవారం కనిపించింది. కాలానుగుణంగా ఉన్న పంటలను, ఇతర పదార్థాలను ఈ గ్రామం వద్ద బస్సులు ఆగినప్పుడు అమ్మి జీవనోపాధి సాగిస్తారు. బస్సు నడిస్తే పరుగుపెడుతూ..జొన్నపొత్తుల ద్వారా వచ్చే రూ.50లకు రోజంతా కష్టపడి జేబు నిండితే ఆనందంగా ఇంటి బాట పడతారు.

News February 16, 2026

ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

image

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్‌పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్‌ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.