News October 5, 2025
నరసరావుపేటలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే.!

నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ 128 రూపాయలుగా ఉంది. స్కిన్‌తో రూ. 180 నుంచి రూ. 220 వరకు ఉంది. స్కిన్ లెస్ రూ. 200 నుంచి రూ. 230 పలుకుతోంది. లైవ్ పేపర్ ధర గత వారంతో పోలిస్తే 20 రూపాయలు తగ్గినప్పటికీ చికెన్ ధరను తగ్గించలేదని వినియోగదారులు అంటున్నారు. అదే విధంగా 100 కోడిగుడ్ల రూ. 540. మటన్ కేజీ రూ. 800 నుంచి రూ. 900 లకు అందుబాటులో ఉంది.
Similar News
News January 23, 2026
కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
News January 23, 2026
సంగారెడ్డి: నేడే పరీక్ష.. హాజరు కాకుంటే ఫెయిల్

ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుక్రవారం (నేడు) నైతికత, మానవ విలువల పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఈ పరీక్షకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే ఫెయిల్ అయినట్లుగా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News January 23, 2026
₹లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు: భట్టి

TG: మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేస్తామని తెలిపారు. ‘ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే కాదు. ప్రతివారం బిల్లులు ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్లు నిర్మించుకోవాలి. బిల్లు చెల్లించే బాధ్యత మాది’ అని ఆసిఫాబాద్ జిల్లా జంగాంలో చెప్పారు.


