News March 14, 2025
నరసరావుపేట: జిల్లా కలెక్టర్ హెచ్చరికలు

సహకార సంఘ బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసే విషయంలో పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు హెచ్చరించారు. కలెక్టరేట్లో సహకార సంఘం అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. మాట్లాడుతూ సంవత్సరం నుంచి కంప్యూటరీకరణ జరుగుతుందని పురోగతి సరిగా లేదని అన్నారు. సరిగా పనిచేయని సంఘ సీఈవో పై ఏమి చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారులను ప్రశ్నించారు.
Similar News
News February 10, 2026
మహాదేవప్ప కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుంది: ఎంపీ

మక్తల్ బీజేపీ 6వ వార్డు అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మృతి వార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ఓటమి భయంతో బీజేపీ అభ్యర్థులను అధికార కాంగ్రెస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఫలితంగా జరిగిన హత్య అని ప్రకటనలో తెలిపారు. కుటుంబాన్నీ పరామర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
News February 10, 2026
ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం: DGP

TG: నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని DGP శివధర్ రెడ్డి వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవమని, ఆ కేసు ఫైల్స్‌ను 2021లోనే కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులూ ఇచ్చామన్నారు. HYD మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రచార సమయంలో ₹3.09Cr పట్టుబడినట్లు వెల్లడించారు. మక్తల్ BJP అభ్యర్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేశామన్నారు.
News February 10, 2026
అమరావతి అనుసంధానంగా నాలుగు వరుసల ROB

రాజధాని అమరావతి అనుసంధానంగా మంగళగిరి పట్టణంలో నిడమర్రు రైల్వే గేట్ వద్ద నాలుగు వరుసల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రూ.90.58 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును18 నెలల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రద్దీ తగ్గించి, అమరావతి ప్రాంతానికి వేగవంతమైన రాకపోకలకు ఇది దోహదం చేయనుంది.


