News May 7, 2025
నరసరావుపేట: బాధితులతో మర్యాదగా మెలగాలి: ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయించినా కఠినంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News February 18, 2026
వరంగల్ నిట్ ప్రాజెక్ట్ డిజైన్‌కు భారతీయ పేటెంట్

నిట్ వరంగల్ మెకానికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.రాఘవేంద్ర, వి.సురేష్ బాబు, బీటెక్ విద్యార్థి వలబోజు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టు డిజైన్‌కు పేటెంట్ లభించింది. “స్మార్ట్ ఫంక్షనల్లీ గ్రేడెడ్ మెటీరియల్” అనే డిజైన్‌ను భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం నమోదు చేసింది. ఇది ఆవిష్కరణ, పరిశోధనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందంటూ నిట్ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News February 18, 2026
సంగారెడ్డి: ఓటర్ల సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం సర్వే మాత్రమే పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
News February 18, 2026
పేద మహిళల కోసం ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్

పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు బ్యాంకు లింకేజీ రుణాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రెడిట్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వేగవంతంగా లోన్ రికవరీ చేయాలని సూచించారు.


