News April 21, 2024

నరసాపురంలో చిన్నప్పుడు తప్పిపోయా: పవన్ కళ్యాణ్

image

నరసాపురంతో తనకు చాలా మంచి జ్ణాపకాలు ఉన్నాయని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరసాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఒంగోలు నుంచి మొగల్తూరు వెళ్తుండగా నరసాపురం బస్టాండ్‌లో ఆగినప్పుడు తప్పిపోయాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను దుకాణంలో కూర్చొబెట్టి నాన్న వచ్చాక వెయిట్ చేసి అప్పజెప్పారంటూ గుర్తుచేసుకున్నారు.

Similar News

News December 5, 2025

కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

image

భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News December 5, 2025

ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

image

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్‌కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్‌ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.