News May 15, 2024
నరసాపురం – గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలు రద్దు

నరసాపురం- గుంటూరు మధ్య నడిచే గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైలును ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకూ రద్దు చేశారు. గుంటూరులో ట్రాక్ మరమ్మతు పనులు జరగనున్నందున…. ఈ రైలును తాత్కాలికంగా రద్దు చేశారు. గతేడాది సైతం ట్రాక్ మరమ్మతుల పేరిట కొన్నాళ్లపాటు ఈ రైలు రైల్వే శాఖాధికారులు రద్దు చేశారు. రైలును పూర్తిగా రద్దు చేయకుండా, విజయవాడ లేదా రామవరప్పాడు వరకైనా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News December 14, 2025
పాలకొల్లులో వైసీపీ రాష్ట్ర నేతకు సీఐడీ నోటీసులు

వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు మద్దా చంద్రకళకు సీఐడీ అధికారులు పాలకొల్లులో నోటీసులు అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో 2022లో పాలకొల్లు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ కేసు దర్యాప్తులో భాగంగా తనకు ఈ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 15న రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నట్లు చంద్రకళ తెలిపారు.
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.
News December 13, 2025
నరసాపురంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

నరసాపురం కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ..కేసులు పరిష్కారంలో రాజీయే రాజమార్గమన్నారు. దీనివల్ల కక్షలు పెరగవని కోట్లు చుట్టూ చుట్టూ తిరిగి సమయాన్ని డబ్బును వృథా చేసుకోవలసిన అవసరం ఉండదు అన్నారు.


