News April 30, 2024

నరసాపురం పార్లమెంట్ బరిలో 21 మంది అభ్యర్థులు

image

నరసాపురం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసే నాటికి 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.‌ సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎవరు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో నిలిచారన్నారు.‌

Similar News

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News April 14, 2026

ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

image

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.