News November 17, 2024
నరసాపురం: సబ్ జైల్ తనిఖీ చేసిన జడ్జీ వరలక్ష్మి
జైల్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా టౌన్ లోని సబ్ జైల్‌ను ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆర్. వరలక్ష్మి శనివారం పర్యవేక్షించి నిందితుల కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలు తదితర విషయాలను ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాదారులు జైల్ ముద్దాయిలకు అందించే న్యాయ సహాయంపై న్యాయమూర్తి ఆరా తీశారు.
Similar News
News December 14, 2024
పాలకోడేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి-ఎస్సై
సోంపల్లి శివాలయం సమీపంలో గురువారం రాత్రి రెండు మోటర్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో గాయపడిన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన కొరత్తిక బాబి కాకినాడ జీ.జీ.హెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాబి సొంత పనుల నిమిత్తం పల్సర్ బైక్‌పై మండపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుని తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజోలు ఎస్ఐ రాజేష్ తెలిపారు.
News December 14, 2024
ఏలూరు DLTCలో 17న జాబ్ మేళా
ఏలూరు DLTC ఐటీఐ కాలేజీలో డిసెంబర్ 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DLTC సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి తెలిపారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. సుమారు 100 ఖాళీలకు ఈ జాబ్ ఫెయిర్ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డీగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వారు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. నిరుద్యోగులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 14, 2024
బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లు కొనసాగించాలి: జేసీ
జిల్లాలో బియ్యం, కందిపప్పు, వంటనూనె ప్రత్యేక కౌంటర్లను మరికొంత కాలం కొనసాగించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని వ్యాపార సంఘాలు, కిరాణా వ్యాపారస్తులతో నిత్యవసర సరుకుల ధరలపై సమీక్ష నిర్వహించారు. తణుకు పట్టణంలో ప్రత్యేక కౌంటర్‌లో మినప్పప్పు కూడా హోల్‌సేల్ ధరలకు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.