News May 7, 2025

నర్సంపేట: ఒకరిపై పోక్సో కేసు నమోదు

image

వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇటీవల అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 13, 2026

ఫుట్‌వేర్ కొంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

image

పాదాల రక్షణకు ఫుట్‌వేర్ అవసరం. అయితే చెప్పులు కొనేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు . మీ సైజ్‌కు సరిపోయే చెప్పులే కొనాలి. టైట్/ లూజ్‌గా ఉంటే నడవడానికి ఇబ్బందవుతుంది. ఫుట్‌వేర్ స్టైల్‌తో పాటు ధరకి సరిపడా క్వాలిటీ ఉందో..లేదో చూసుకోవాలి. మీ అవసరాన్ని బట్టి రెగ్యులర్ వేర్, ఫంక్షనల్ వేర్, ఆఫీస్ ఫుట్‌వేర్ ఎంచుకోవాలి. వైట్, బ్లాక్, క్రీమ్ కలర్ ఫుట్ వేర్ ఏ డ్రెస్‌కైనా మ్యాచ్ అవుతాయి.

News February 13, 2026

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సిపి సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, కేవలం అనుమతి పత్రాలు ఉన్నవారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని స్పష్టం చేశారు.

News February 13, 2026

బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

image

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.