News May 7, 2025
నర్సంపేట: ఒకరిపై పోక్సో కేసు నమోదు

వరంగల్ జిల్లా నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై పోక్సో కేసు నమోదైంది. నర్సంపేట మండలంలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఇటీవల అదే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలికను కిడ్నాప్ చేసి, లైంగికదాడికి పాల్పడినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 7, 2026
MHBD: మున్సిపల్ ఎన్నికలు.. కో-ఆర్డినేటర్ల నియామకం

జిల్లాలోని మున్సిపాలిటీలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయకర్తలను నియమించారు. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. మరిపెడకు ఎంపీ బలరాం నాయక్, డోర్నకల్‌కు గదార్ల అశోక్, మహబూబాబాద్‌కు వెంకటేష్, కేసముద్రానికి వెంకట్ రమణలను కేటాయించారు. తొర్రూర్ బాధ్యతలను కడియం కావ్య, హనుమంత్ రెడ్డిలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 7, 2026
తిరుపతి: విద్యార్థులకు గమనిక.. రూ.15 వేల ప్రైజ్‌మనీ

5-10వ తరగతి విద్యార్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్‌కు దరఖాస్తులు కోరుతున్నట్లు సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ తెలిపారు. విద్యార్థులు మార్చి 10లోపు జిల్లా విద్యాశాఖకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ మూడు ప్రాజెక్టులకు రూ.15వేల నగదు బహుమతి అందజేస్తారు. జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్ ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు.
News February 7, 2026
వాకింగ్‌కి టైమ్ లేదా? ఈ చిన్న పనులతో గుండె ఆరోగ్యం

✦ జిమ్/లాంగ్ వాక్‌కు టైమ్ లేకపోయినా VILPA (విగరస్ ఇంటర్మిటెంట్ లైఫ్‌స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
✦ లిఫ్ట్/ఎస్కలేటర్‌కు బదులు మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం మంచిది.
✦ ఇంటి పనులు చేయడం, గ్రాసరీస్ మోయడం, పిల్లలతో ఆడుకోవడమూ యాక్టివిటీనే.
✦ ఎక్కువసేపు కూర్చోకుండా 30నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరగాలి.
✦ డాన్స్, వంట చేస్తూ ఫుట్ ట్యాప్ చేయడం కూడా ఎక్సర్‌సైజ్ చేసినట్టే.


