News November 8, 2025
నర్సాపూర్ (జి): ఫిడే వరల్డ్ చెస్ కప్-2025 ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) గ్రామ వాసి గాడి అరుణ్ కుమార్ ఫిడే వరల్డ్ చెస్ కప్ -2025కి ఆర్బిటర్‌గా(నిర్ణేత) ఎంపికయ్యారు. గోవాలో నవంబర్ 27 వరకు జరిగే ఈ ప్రతిష్టాత్మక చెస్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 83 దేశాల నుంచి 206 మంది ఆటగాళ్లు పాల్గొనే మెగా ఈవెంట్‌కు ఆర్బిటర్‌గా అరుణ్ కుమార్ ఎంపిక కావడం నిర్మల్ జిల్లాకే గర్వకారణమని మండల వాసులు అభినందిస్తున్నారు.
Similar News
News January 17, 2026
నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
News January 17, 2026
NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
News January 17, 2026
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం

AP: వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF)లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం రేపు దావోస్ వెళ్లనుంది. 4 రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. 20 దేశాల తెలుగు ప్రజలను ఉద్దేశించి CM ప్రసంగించనున్నారు. UAE మంత్రి అబ్దుల్లా, టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్‌తో భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 23న HYD చేరుకోనున్నారు.


