News February 16, 2025
నర్సాపూర్ రైల్వే లైన్ భూ సేకరణపై హైకోర్టు స్టే

నర్సాపూర్ రైల్వే లైన్ కోసం 25 ఏళ్ల కిందట సేకరించిన భూమికి సంబంధించి తమకు న్యాయం చేయాలని అమలాపురం మండలం భట్నవిల్లిలో చెందిన 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది రమేశ్‌చంద్ర వర్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న భూమి ధరలను ఇవ్వాలని లేదా తమ భూములను తిరిగి ఇవ్వాలని పేరూరు వైద్యనాథ్‌తో పాటు రైతులు పిటిషన్ దాఖలు వేశారని తెలిపారు. పనులు నిలిపివేయాలని శనివారం హైకోర్టు స్టే విధించినట్లు వివరించారు.
Similar News
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.
News March 16, 2026
పెద్దపులి కోసం బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు..?

కొడిమ్యాల మండలం గంగారాం తండాలో రెండు రోజులుగా పశువులపై పెద్ద పులి దాడి చేయడంతో గంగారాం తండా, దమ్మయ్య పేట సూరంపేట గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి పూట బయటకు రావద్దని వారు ప్రజలకు తెలిపారు.
News March 16, 2026
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.


