News May 13, 2024
నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్స్

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నల్గొండలో ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టణంలోని బోయవాడ పోలింగ్ సెంటర్‌లో ట్రాన్స్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 11, 2025
MGUకి 500 కోట్లు మంజూరు చేయాలని విద్యార్థుల డిమాండ్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 500 కోట్లు మంజూరు చేయాలని గురువారం విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం ప్రకటించిన 1000 కోట్లు స్వాగతించదగ్గదేనిగానీ, ఎంజియు 20 ఏళ్లుగా పీజీ సెంటర్ స్థాయిలోనే ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరత, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుర్దశ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల వల్ల భారీ ఫీజులు, పరిశోధనలో వెనుకబాటు సమస్యలను పరిష్కరించాలని అన్నారు.
News December 11, 2025
BREAKING.. ఎల్లమ్మగూడెం సర్పంచ్‌గా వాణి సందీప్ రెడ్డి

తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన ఊట్కూరి వాణి సందీప్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ బలపరిచిన మామిడి నాగలక్ష్మిపై 459 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఘన విజయంతో సర్పంచ్ మద్దతుదారులు గ్రామంలో బాణసంచా కాల్చి, డప్పుల మోతతో సంబరాలు నిర్వహించారు.
News December 11, 2025
నల్గొండ జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం

అంతయ్యగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన కన్నెబోయిన లక్ష్మయ్య విజయం సాధించారు. ఆయన తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి బ్రహ్మచారిపై 21 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ మద్దతుదారులు బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు.


