News October 8, 2025
నల్గొండ: అంతకుమించి ఖర్చు పెట్టొద్దు..!

అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుకు వీలు లేదని, ఇందుకు పరిమితులు ఉంటాయని చెబుతున్నారు. జడ్పీటీసీకి పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయం రూ.4 లక్షలకు మించరాదు. ఎంపీటీసీ అభ్యర్థి వ్యయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. 5 వేల లోపు జనాభా ఉన్న GP సర్పంచ్ స్థానానికి అభ్యర్థి రూ.1.50 లక్షలు లోపు ఉండాలని సూచించారు.
Similar News
News January 20, 2026
ఒంగోలు SP కీలక ఆదేశాలు

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.
News January 20, 2026
నెల్లూరు కలెక్టర్‌కు అవార్డు

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తన ప్రతిభ చూపారు. ఆయన అందించిన సేవలకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. అత్యధికంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంతో ఆయనకు ఈ అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈనెల 25వ తేదీ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు.
News January 20, 2026
నంద్యాల కలెక్టర్‌కు అవార్డు

నంద్యాల జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జి.రాజకుమారి ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డుకు ఎంపికయ్యారు. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ ఎన్నికల పద్ధతులను అమలు చేసినందుకు ఈ పురస్కారం లభించింది. జనవరి 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.


