News March 14, 2025
నల్గొండ: ఈనెల 17, 18 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల వంటా వార్పు

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు కలెక్టరేట్ ఎదుట వంట వార్పు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సిఐటీయూ జిల్లా నాయకులు అవుటు రవీందర్ తెలిపారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలతో కూడుకున్న మెమోరాండం నల్గొండ జిల్లా కార్యాలయంలో సమర్పించారు.
Similar News
News February 16, 2026
నల్గొండ: MIMలో చేరిన కార్పొరేటర్

నల్గొండ పురపాలక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 26వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ మొయినా భాయ్ హైదరాబాద్‌లో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో MIM తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 107 ఓట్ల మెజారిటీతో సంచలన విజయం సాధించిన ఆయన ఇప్పుడు తిరిగి పతంగి గూటికి చేరారు.
News February 15, 2026
నల్గొండ: గ్రామీణ ప్రతిభకు ‘సీఎం కప్’ వేదిక: కలెక్టర్

గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే ‘సీఎం కప్’ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ బి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. సరైన వేదికలు లేక వెనుకబడుతున్న గ్రామీణ క్రీడాకారులకు ఇది గొప్ప అవకాశమని, పట్టుదలతో ఆడి జిల్లాకు కీర్తి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News February 15, 2026
NLG: అంగన్వాడీలపై ఇక పటిష్ఠ నిఘా

అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తోంది. ఆయా కేంద్రాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలతో పాటు ప్రీస్కూల్, పోషకాహార పంపిణీ తదితర కార్యక్రమాలను ఈ కమిటీలు నిత్యం పర్యవేక్షించనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రెండున్నరేళ్లుగా గ్రామాల్లో సర్పంచులు లేక గతంలో ఉన్న కమిటీలు అంతగా పనిచేయ లేదు.


