News February 18, 2025

నల్గొండ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

పెన్‌పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట రూరల్ పరిధి ఇమాంపేటకు చెందిన మొండికత్తి మల్లేశ్(32) స్వగ్రామం ఇమాంపేట నుంచి పెన్‌పహాడ్ మండల కేంద్రం వైపు తన ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

ఆసిఫాబాద్‌లో ఎల్పీజీ సిలిండర్ కొరత లేదు: కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గృహ అవసరాల LPG సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ హరిత తెలిపారు. గ్యాస్ వినియోగదారులు భయపడవలసిన అవసరం లేదని, నిల్వలను ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పర్యవేక్షిస్తోందన్నారు. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.

News March 13, 2026

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు

image

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి క్లిష్టమైన శస్త్ర చికిత్సలకు కేంద్రంగా మారిందని సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. శుక్రవారం 51 సంవత్సరాల మహిళకు మూత్రశయంలోని 3 గడ్డలు శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలకు ఆర్థోస్కోపిక్ విధానంలో కుడి భుజానికి, ఎడమ మోకాలికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. సర్జరీలో పాల్గొన్న వైద్యబృందాన్ని అభినందించారు.

News March 13, 2026

గ్యాస్ కొరత లేదు.. ఆందోళన వద్దు: కలెక్టర్ తేజస్

image

సూర్యాపేట జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 17,647 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, బుక్ చేసిన 2-3 రోజుల్లోనే డెలివరీ అవుతాయని తెలిపారు. సర్వర్ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని కోరారు. డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.