News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం!

image

తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది.
జిల్లాలో అనేక పంచాయతీలో ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవు గానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ.

Similar News

News February 13, 2026

1,782 మంది సిబ్బందితో బందోబస్తు: నంద్యాల ఎస్పీ

image

శ్రీశైలం క్షేత్రంలో 1,782 మంది సిబ్బందితో బ్రహ్మోత్సవాల ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. నంద్యాలలో ఏఎస్పీ, డీఎస్పీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఏఎస్పీలు 11 మంది, డీఎస్పీలు 24, సీఐలు 78, ఎస్సైలు 132, ఏఎస్ఐ-హెచ్‌సీలు 303, పీసీలు 568, ఉమెన్ పీసీలు 88, హోంగార్డులు 386, ఉమెన్ హోంగార్డ్స్ 30 మందితో పాటు ఏఆర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

News February 13, 2026

పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

image

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.