News March 19, 2024
నల్గొండ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి హత్య
గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి వ్యవసాయ బావిలో పడవేశారు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి శివారులో వెలుగు చూసింది. అనిశెట్టి దుప్పలపల్లి శివారులో సక్కుబాయికి చెందిన వ్యవసాయ భూమిని పవన్ కౌలు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బోరు బావిలో పరిశీలిస్తుండగా నీటిపై మృతదేహం తెలియాడడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి
త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.
News September 15, 2024
నల్గొండ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.